రూ. 38.15 లక్షలు తీసుకుని మోసగించిన మహిళ అరెస్ట్
NZB: జిల్లాలో డబ్బుల పేరుతో ప్రజలను మోసగించిన మహిళను అరెస్టు చేసినట్లు సీఐ సురేష్ తెలిపారు. ఇటీవల మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురి వద్ద 3 ఎకరాల భూమి ఇస్తానని నమ్మించి వారి నుంచి రూ. 38.15 లక్షలు తీసుకుని మోసం చేసింది. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు స్వర్ణ ప్రమీలను అదుపులోకి తీసుకొని రిమాండు తరలించారు.