పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి: కవిత

TG: భారత్, పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ముందుగా దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు నివాళులర్పించారు. ఈ మొత్తం కాల్పుల విరమణ ఫలితం భారత్, పాక్ మధ్య శాంతి అయితే.. దానిని స్వాగతించాలని చెప్పారు. ఈ సమస్యలన్నింటినీ ప్రజలకు వివరించడానికి, కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.