కలెక్టరేట్‌లో పవన్ కళ్యాణ్ రివ్యూ మీటింగ్స్
విశాఖ: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కలెక్టరేట్‌లో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరాపై, మధ్యాహ్నం 2 గంటలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో పెండింగ్ పనులు, పర్యావరణ అంశాలపై చర్చించనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.