గిట్టుబాటు ధర లేక రైతుల ఇబ్బందులు

గిట్టుబాటు ధర లేక రైతుల ఇబ్బందులు

KDP; పులివెందుల ప్రాంతం అరటి పంట సాగుకు ప్రసిద్ధి. ఇక్కడి అరటి కాయలను దేశ, విదేశాలకు ఎగుమతులు చేస్తుంటారు. ఇక్కడి రైతులకు మాత్రం గిట్టుబాటుధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం టన్ను అరటికాయలు రూ. 10వేల నుంచి రూ. 11వేలు పలుకుతున్నాయని, ఈ ధరలు గిట్టుబాటు కాలేదని రైతులు వాపోతున్నారు. అరటి ధరలు పతనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.