పార్టీ కార్యాలయంలో సహపంక్తి భోజనాలు
MBNR: జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సహపంక్తి భోజనాల కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు .సమాజంలో అసమానతలు తొలగించడమే తమ లక్ష్యం అని అన్నారు. ఇందులో స్థానిక నేతలు పాల్గొన్నారు.