పాఠశాలను సందర్శించిన జర్మనీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి
PDPL: ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాలను జర్మనీకి చెందిన 'మై వాయిస్ ఫర్ పూర్ ఫౌండేషన్' వ్యవస్థాపకురాలు ఒడిట్టే మేజమే కల్డవాల్ ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలోని వసతులు, విద్యార్థుల సామర్థ్యాలు పరిశీలించారు. హెచ్ఎం మల్లన్న పాఠశాల పూర్వాపరాలు ఆమెకు వివరించారు. దీంతో పాఠశాల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థ తరఫున సహాయం అందజేస్తామని ఆమె పేర్కొన్నారు.