కౌశిక్ రెడ్డిపై చర్యలు అన్యాయం : MLA సునీత లక్ష్మారెడ్డి
MDK: నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. కడియం శ్రీహరిని “మీరు ఏ పార్టీ?” అని మాత్రమే ప్రశ్నించారని, ఇతర సభ్యులు కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగిన సందర్భాలు ఉన్నప్పటికీ, కేవలం కౌశిక్ రెడ్డిపైనే చర్యలు తీసుకోవడం అన్యాయమని విమర్శించారు.