ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ

HNK: పరకాల మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కాంగ్రెస్ నేతలు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సమన్వయ కమిటీ సభ్యుడు సంపత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంతో పేదల ఇంటి కల నెరవేరుతుందని, నిబంధనలు పాటిస్తూ నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు.