"ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు'

"ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు'

తూ.గో: ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ హెచ్చరించారు. గొల్లప్రోలు మండలం దుర్గాడ జిల్లా పరిషత్ హైస్కూల్లో విజిబుల్ పోలీసింగ్‌ను నిర్వహించారు. ఈవ్ టీజింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ.. మండల పరిధిలో ఉన్న కాలేజీలు స్కూల్స్ వద్ద విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.