'ఉచిత ఇసుక హామీని నెరవేర్చాలి'

'ఉచిత ఇసుక హామీని నెరవేర్చాలి'

ప్రకాశం: మార్కాపురంలో సోమవారం సీపీఎం నాయకులు భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఉచిత ఇసుక హామీని నెరవేర్చాలని నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వ నాయకులు ఉచిత ఇసుక హామీని నీరుగారుస్తున్నారని, లారీ యజమానులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. టన్ను రూ. 800కు దొరకాల్సిన ఇసుక రూ.1400కు అమ్ముడవుతోందని సీపీఎం నాయకులు మండిపడ్డారు.