వర్షంతో 100 ఎకరాల వరికి నష్టం
NLR: చేజర్ల మండలంలో వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కాకివాయ గ్రామంలో 100 ఎకరాలకు పైగా వరి పంట దెబ్బతింది. కోత దశలో ఉన్న పంట వాలి నీటిలో నానిపోయి వరికి మొలకలు రావడంతో భారీగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి తక్షణ సాయం అందించాలని కోరుతున్నారు.