నౌపడాలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

SKLM: టెక్కలి నియోజకవర్గంలో సంతబొమ్మాలి మండలం నౌపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించే జాతీయ నులిపురుగుల నివారణదినోత్సవాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నౌపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ పరిమళ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నౌపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో మొత్తం 3093 విద్యార్థులకు మందులు ఇచ్చామన్నారు.