అంతర్జాతీయ బాలికా దినోత్సవంలో పాల్గొన్న కలెక్టర్‌

అంతర్జాతీయ బాలికా దినోత్సవంలో పాల్గొన్న కలెక్టర్‌

VSP: విశాఖలోని తోటగరువు జిల్లా పరిషత్ పాఠశాలలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కలల సాధనకు, బంగారు భవిష్యత్తుకు చదువే ప్రధాన మార్గమన్నారు. విద్యార్థినులు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహించాలని సూచించారు.