భీమవరంలో రొయ్యల వ్యాపారి ఆత్మహత్య
భీమవరం టౌన్ హాల్ లాడ్జిలో పాలకోడేరు మండలం గొల్లలకోడేరుకు చెందిన అడబా శివ నిన్న ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు తలుపులు బద్దలు కొట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆర్థిక లావాదేవీలు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.