VIDEO: చప్పరంపై ఊరేగిన లంబోధరుడు

CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి 17వ రోజు శుక్రవారం రాత్రి విమానోత్సవ సేవ నిర్వహించారు. ఈ మేరకు లంబోదరుడు చప్పరంపై కాణిపాకం పురవీధుల్లో ఊరేగారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, విమానోత్సవ సేవ ఉభయ దారులు పాల్గొన్నారు.