'రోడ్డు భద్రత కార్యక్రమాలను విజయవంతం చేయాలి'
BHNG: రోడ్డు భద్రత కార్యక్రమాలను జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. సీఎస్, డీజీపీల వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మాట్లాడుతూ.. ఈనెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్డు భద్రత ప్రతిజ్ఞతో పాటు ఇతర కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.