చెన్నూర్ మున్సిపాలిటీలో BRSలోకి చేరికలు

చెన్నూర్ మున్సిపాలిటీలో BRSలోకి చేరికలు

MNCL: చెన్నూర్ మున్సిపాలిటీ 16వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ తుమ్మ రమేశ్, కొత్తగూడెం కాలనీకి చెందిన పలువురు ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసహనంగా ఉన్నారని తెలిపారు. KCR మళ్లీ సీఎం కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని సుమన్ పేర్కొన్నారు.