కేదార్‌నాథ్‌లో GVMC బిల్ కలెక్టర్ మృతి

AP: కేదార్‌నాథ్‌లో తీవ్ర విషాదం జరిగింది. కుటుంబంతో సహా కేదార్‌నాథ్‌కు వెళ్లిన విశాఖ జిల్లా గాజువాకకు చెందిన GVMC బిల్ కలెక్టర్ పాలవెల్లి మృతిచెందారు. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు వెంటనే రుద్ర ప్రయాగ ఆస్పత్రిలో చేర్పించగా.. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతదేహాన్ని గాజువాకకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.