‘మోదీ ఏదో ఇస్తారనుకున్నాం.. పవన్‌కు చాక్లెట్ ఇచ్చారు’

AP: ప్రధాని మోదీ పర్యటనపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సెటైర్లు వేశారు. అమరావతి పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ప్రజలకు ఏదో ఇస్తారనుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చాక్లెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. రైతుల నుంచి ప్రభుత్వం ప్రతి ధాన్యం గింజ కొనాలని డిమాండ్ చేశారు. చిరిగిపోయిన సంచులు ఇచ్చి రైతులకు ఏం చేస్తారని మండిపడ్డారు.