ఆదోనిని జిల్లా చేయాలని మంత్రికి వినతి

KRNL: ఆదోని జిల్లా ఏర్పాటుకు ఎమ్మెల్యే పార్థసారథి కృషి చేస్తున్నారు. ఆయన కర్నూలు ఇంఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడును బుధవారం కలిశారు. ఆదోని మండలాన్ని నాలుగు మండలాలుగా విభజించి ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కల్పించాలని కోరారు. అలాగే ఆదోనిని జిల్లా చేయాలని, ఈ ప్రాంత అభివృద్ధికి ఇది అవసరమని పేర్కొన్నారు.