ధర్మ పోరాట దీక్ష చేపట్టిన బీసీ సంఘం నాయకులు

ధర్మ పోరాట దీక్ష చేపట్టిన బీసీ సంఘం నాయకులు

BDK: మణుగూరు మండలం అంబేద్కర్ సెంటర్‌లో ఇవాళ బీసీ సంఘం నాయకులు 42% రిజర్వేషన్ పెంచాలని కోరుతూ ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బీసీలకు రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం దీక్ష చేపట్టిన నాయకులకు సంఘీభావంగా మాల మహానాడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.