VIDEO: కోడూరులో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహొత్సవం
కృష్ణా: కోడూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. గోవిందా నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.