VIDEO: గుంతకల్లులో రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ

ATP: గుంతకల్లులోని రెండు ఇండ్లలో ఆదివారం దుండగులు చోరీకి పాల్పడ్డారు. కసాపురం రోడ్‌లో రైల్వే ఉద్యోగి శరత్ ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలు పగలగొట్టి 13 తులాల బంగారు ఆభరణాలు, రూ. 20,000 నగదును ఎత్తుకెళ్లారు. అలాగే రామాంజనేయులు ఇంట్లో చొరబడి బీరువాలో ఉన్న 2 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.