పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

VZM: గజపతినగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 1997-2002 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులంతా చాలా ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో ఒకరికి ఒకరు ఆప్యాయంగా పలకరించుకొని, ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఆనందంగా గడిపారు. అనంతరం పలుసేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహణకు తీర్మానం చేశారు.