సగం కాలిన మహిళ మృతదేహం లభ్యం

సగం కాలిన మహిళ మృతదేహం లభ్యం

VSP: భీమిలి సాగర తీరంలోని దాకమర్రి ఫార్చ్యూన్ లేఔట్‌లో మహిళ మృతదేహం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం సగం కాలి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళను చంపి మృతదేహాన్ని కాల్చడానికి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.