రావి ఆకుపై సావిత్రిబాయి పూలే చిత్రం ఆవిష్కరణ
SRD: భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఇవాళ ఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ ఆకుపై ఆమె చిత్రాన్ని గీసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రానికి నివాళులర్పించారు. సావిత్రిబాయి తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి మహిళల విద్య, సామాజిక న్యాయం కోసం అసాధారణ కృషి చేసిందని ఆర్టిస్ట్ పేర్కొన్నారు.