మచ్చర్ల గ్రామంలో కోతుల బెడద
MHBD: గూడూరు మండలం మచ్చర్ల గ్రామంలో కోతుల బెడద పెరిగిపోతోంది. గుంపులుగా తిరుగుతున్న కోతులు ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి సామాన్లు పగులగొట్టడం, పిల్లలను భయపెట్టడం జరుగుతోంది. బయటికి రావడానికి కూడా భయపడుతున్నామని గ్రామస్థులు పేర్కొన్నారు. కోతుల సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.