విషాదం.. అదృశ్యమైన బాలుడు మృతి
GNTR: తెనాలి బాలాజీరావుపేటకు చెందిన ఐదేళ్ల బాలుడు ఆశిక్ రెహమాన్ నిన్న ఇంటి వద్ద ఆడుకుంటూ కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు, స్థానికులు రాత్రంతా ముమ్మరంగా గాలించారు. అయితే, వీరి ఇంటి సమీపంలోని పడమర కాలవలో బాలుడు మృతదేహం ఇవాళ వెలుగు చూసింది. బాలుడు ఆడుకునే క్రమంలో కాలువలో పడి మృతి చెందినట్లు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.