గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనలు మళ్లీ చర్చలోకి..!
NTR: విజయవాడ కార్పొరేషన్ విస్తరణపై చర్యలు వేగవంతమయ్యాయి. నియోజకవర్గాల పునర్విభజనతో గ్రేటర్ ప్రతిపాదనలు తిరిగి తెరపైకి వచ్చాయి. జనాభా పెరుగుదల, గ్రామాల విలీనంతో నగర జనాభా 25 లక్షలు దాటే అవకాశం ఉంది. దీంతో డివిజన్ల సంఖ్య 150 వరకు పెరిగే అవకాశం ఉండగా, ఈ నిర్ణయం నగర భవిష్యత్తుకు కీలకం కానుంది.