ఈ-కేవైసీ ప్రక్రియను పరిశీలించిన డీఎస్‌వో

ఈ-కేవైసీ ప్రక్రియను పరిశీలించిన డీఎస్‌వో

NRPT: నర్వ మండలంలో జిల్లా పౌరసరఫరాల అధికారి (DSO) డీటీ-ఎన్‌ఫోర్స్‌మెంట్ నాగరాజు రేషన్ బియ్యం నిల్వలను, ఈ-కేవైసీ ప్రక్రియను శుక్రవారం తనిఖీ చేశారు. మండలంలోని గోదాములు, రేషన్ దుకాణాలను సందర్శించి బియ్యం నాణ్యత, లెక్కలను సరిచూశారు. లబ్ధిదారులకు అందుతున్న బియ్యంలో అవకతవకలు జరగకూడదని ఆదేశించారు. రేషన్ కార్డుదారులందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు.