బోసిపోయిన చిత్రావతి హారతి ఘాట్
SS: పది రోజులుగా వేలాదిమంది భక్తులు, సందర్శకులతో సందడిగా ఉన్న చిత్రావతి నది తీరం, హారతి ఘాట్ ప్రాంతం బోసిపోయింది. ఉత్సవాలు ముగియడంతో ఘాట్ వద్ద సందడి పూర్తిగా తగ్గిపోయింది. పండుగ వాతావరణం అనంతరం నది తీరం తిరిగి ప్రశాంతతను సంతరించుకుంది. ఈనెల 13 నుంచి 23 వరకు సత్యసాయి బాబ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.