ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

NRML: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు ఇంద్రవెల్లిలో భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తారు.10:30కి ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.