రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

KNR: చిగురుమామిడి మండలం సుందరగిరికి చెందిన గిరబోయిన అజయ్ (21) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం సుందరగిరి రాజ్యాంగ సభ చిహ్నం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అజయ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.