విజయవాడలో భారీ చోరీ
NTR: విజయవాడలో భారీ చోరీ జరిగింది. పడమట సోనోవిజన్‌లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. షోరూం రేనోవేషన్ జరుగుతుండగా షోరూమ్‌లో ఉండాల్సిన 18 లక్షల విలువ గల సెల్ ఫోన్‌లు చోరీకి గురైనట్లు మేనేజర్ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఘటనా స్థలానికి చేరుకుని చోరి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.