మహారాణి వర్ధంతి కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే
KKD: దేవాదాయశాఖకు చెందిన ఆర్‌వీబీ మహరాణి సత్రంలో వ్యవస్థాపకురాలు మహారాణి బుచ్చి సీతాయమ్మ వర్ధంతి శనివారం జరిగింది. 193 ఏళ్లుగా ఇక్కడ నిత్యం అన్న, వస్త్రదానాలు చేస్తారు. విద్య, వైద్య సేవలను అందిస్తారు. మహారాణి వర్ధంతి కార్యక్రమానికి MLA నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. EO కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆయన చేతుల మీదుగా పేదలకు వస్త్రాలను, దుప్పట్లు పంపిణీ చేశారు.