జగదీష్ రెడ్డిపై కవిత నిప్పులు
SRPT: ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీరుపై జాగృతి అధ్యక్షురాలు కవిత సూర్యాపేటలో నిప్పులు చెరిగారు. ఇళ్లను కూల్చి బాధితులకు పరిహారం ఇవ్వకుండా 300 మంది ఉపాధిని దెబ్బతీశారని మండిపడ్డారు. పుల్లారెడ్డి చెరువు అభివృద్ధి, పట్టాల పంపిణీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దత్తత గ్రామం చీదెళ్ళలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, కర్నాల చెరువు కబ్జాలకు గురవుతోందని ఆరోపించారు.