ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి
నెల్లూరు మైపాడు బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. బీచ్‌లో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మృతులు నారాయణరెడ్డి పేటకు చెందిన ఇంటర్ విద్యార్థులుగా సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.