అక్రమ ఇసుక ఫిల్టర్ ధ్వంసం
RR: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక ఫిల్టర్లను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు ఎస్సై వెంకటేష్ అన్నారు. మండల రెవెన్యూ అధికారులు ఉత్తర్వుల ప్రకారం మండల పరిధి శెట్టిపల్లి గ్రామ శివారులో పర్వతాలు, శ్రీశైలం నిర్వహిస్తున్న అక్రమ ఇసుక ఫిల్టర్‌ను ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి బైండోవర్ చేసినట్లు తెలిపారు.