'బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి'

BHPL: జిల్లా సుభాశ్ కాలనీ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో 13 మంది విద్యార్థులు కలుషిత నీరు, ఆహారం తిని అస్వస్థతకు గురైన ఘటనపై సీపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి మల్లేశ్ అనుమానం వ్యక్తం చేశారు. శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రిన్సిపల్‌పై కూడా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.