ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఆటో డ్రైవర్ల నిరసన

W.G: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని నిరసిస్తూ పెనుమంట్ర మండలంలో ఆటో డ్రైవర్లు గురువారం నిరసన చేపట్టారు. ఈ పథకంతో తమ ఆదాయం బాగా తగ్గిపోతుందని, కుటుంబాల జీవనోపాధి కష్టాల్లో పడుతుందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, వాహన మిత్ర కింద రూ. 15,000 అందించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మండల రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు.