తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

HNK: కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన పూజారి రవి (52) బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలు కాగా గమనించిన స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబానికి చెందిన రవి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.