'క్షమాపణ చెప్పినా.. టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది'
AP: మాజీ సీఎం జగన్ క్రిస్టియన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభలో అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పినా.. సోషల్ మీడియాలో టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. అంతే కాకుండా చట్టసభలో శాసనమండలి ఛైర్మన్‌ను సైతం టీడీపీ నేతలు అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు.