ఘనంగా దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు
పెద్దపల్లి జిల్లా మంథనిలోని చిల్లపల్లిలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమ్మురయ్య 99వ జయంతి వేడుకలను ఘనంగా సర్పంచ్ గోపు సంతోష్ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దోపిడీలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి అమరుడైన దొడ్డి కొమురయ్య సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం మండల అధ్యక్షులు కంచు మల్లేష్, కుర్మ సంఘం కుల పెద్దలు కొమ్ము రాజయ్య పాల్గొన్నారు