హసీనా అప్పగింతపై భారత్‌కు బంగ్లా అభ్యర్థన
మాజీ ప్రధాని హసీనాను అప్పగించాలని భారత్‌ను బంగ్లాదేశ్ మరోసారి అభ్యర్థించింది. ఇప్పటికే హసినాకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మరణ శిక్ష విధించిందని పేర్కొంది. ఈ తీర్పును అమలు చేసేందుకు హసీనాను తిరిగి తమ దేశానికి పంపాలని కోరింది. హసీనా అప్పగింతపై గతంలో భారత్ స్పందిస్తూ.. బంగ్లా శాంతిభద్రతలు, ప్రజాస్వామ్యం, సుస్థిరతకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.