ప్రభుత్వ భూమిలో సూచిక బోర్డు ఏర్పాటు చేసిన రెవెన్యూ సిబ్బంది

ప్రభుత్వ భూమిలో  సూచిక బోర్డు ఏర్పాటు చేసిన రెవెన్యూ సిబ్బంది

SRD: ప్రభుత్వ భూమి కబ్జా అంటూ వివిధ పత్రికలలో వచ్చిన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. హత్నూర మండలం కాసాల గ్రామ శివారులోని సర్వే నెంబర్ 336లో ప్రభుత్వ భూమి అని సూచిక బోర్డును రెవెన్యూ అధికారులు శుక్రవారం ఏర్పాటు చేశారు. ఇట్టి భూమిలో ఎవరైనా కబ్జాకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.