జనసేనలోకి వైసీపీ నేతలు చేరిక

జనసేనలోకి వైసీపీ నేతలు చేరిక

VZM: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై డెంకాడ మండలం, పేడాడ పంచాయతీకి చెందిన ముఖ్య నేతలు శుక్రవారం వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. జిల్లా జనసేన సీనియర్ నాయకులు లోకం ప్రసాద్ వీరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.