పన్నుల వసూళ్లపై ముమ్మర చర్యలు

పన్నుల వసూళ్లపై ముమ్మర చర్యలు

కృష్ణా జిల్లాను పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే నూరు శాతం లక్ష్యంతో అగ్రస్థానంలో నిలిపేందుకు జిల్లా పంచాయతీ అధికారిణి డాక్టర్ అరుణ క్షేత్రస్థాయిలో ముమ్మర చర్యలు చేపట్టారు. బకాయిల వసూళ్లలో వెనుకబడిన పంచాయతీ కార్యదర్శులతో ఆమె సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం కంకిపాడు, మచిలీపట్నం, పామర్రు అధికారులతో మాట్లాడి దిశానిర్దేశం చేశారు.