ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన విమర్శలు
AP: ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శలు గుప్పించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలేంటి? ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలేంటి? అని నిలదీశారు. వాటిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. అప్పుల విషయంలో అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో విధ్వంసం జరుగుతోందని ధ్వజమెత్తారు. పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారే తప్ప చేతల్లో కనిపించడం లేదని విమర్శించారు.