'ఆలయ భూములు అన్యక్రాంతం కాకుండా చూసుకోవాలి'

NDL: ఆలయాల మాన్యం భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు. మంగళవారం మహానంది పుణ్యక్షేత్ర పరిధిలోని టీటీడీ కళ్యాణ మండపంలో పలు జిల్లాల ఈవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్, ఈవోలు శ్రీనివాసరెడ్డి, ఏఈవో మధు తదితరులు పాల్గొన్నారు.