నేడు శ్రీకాకుళంలో జాబ్ మేళా

నేడు శ్రీకాకుళంలో జాబ్ మేళా

శ్రీకాకుళం జిల్లా నెహ్రూ యువ కేంద్రంలో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ఉపాధి అధికారిణి కొత్తలంక సుధా వెల్లడించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాలో పలు ప్రైవేట్ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని తెలిపారు.